Srikakulam శిథిలావస్థలో నిర్మాణాల వెనుక ఉన్న అపురూప history | ABP Desam

2022-06-22 17

పేరు ఎస్ఎం పురం.. పూర్తి పేరు షేర్ మహమ్మద్ పురం. చూసేందుకు సాదాసీదా ఊరు. 16 వ నంబర్ పాత జాతీయ రహదారి దాటి శ్రీకాకుళం  రోడ్డుపై ఈ ఊరికి వస్తే చెరువు గట్టుపై కొన్ని శిథిల నిర్మాణాలు కనిపిస్తాయి. ఆ ఊరు, ఊరి పేరు, ఆ పేరు వెనుక తీరూతెన్నూ అన్నీ ఈ శిథిలాలే తమలో దాచుకున్నాయి. గోలుకొండ qutub shahi నవాబులకు శ్రీకాకుళానికి సంబంధమేమిటో, ముస్లిం పేరు ఈ ఊరికి ఎందుకు వచ్చిందో, అసలు ఈ నిర్మాణాలేమిటో అన్న కథలను కాలం దాచుకుంది.